ODI WC 2023, India vs Australia Highlights: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలలో  డేవిడ్ వార్నర్ 41 పరుగులు, స్టీవ్ స్మిత్ 46 పరుగులు చేశారు. అనంతరం భారత్‌ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్‌ శర్మ, ఇషాన్ కిషన్‌, శ్రేయస్ అయ్యర్‌ ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రాహుల్, కోహ్లీ అదుకున్నారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడి నాలుగో వికెట్ కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 167 పరుగుల వద్ద కోహ్లీ ఔటైనా హార్దిక్, రాహుల్ మిగతా పనిని పూర్తి చేశారు. రాహుల్ సెంచరీ మిస్సయింది. కోహ్లీ (85; 116 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (97*; 115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన మిచెల్ మార్ష్ డకౌట్ అయ్యాడు. అనంతరం వార్నర్ కు జతకలిసిన స్టీవ్ స్మిత్ ఆచితూతి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ తమ జోరును కొనసాగించారు. 76 పరుగుల వద్ద వార్నర్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లుబూషేన్ కూడాజాగ్రత్తగా ఆడాడు. అయితే వీరి జోడి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో 110 రన్స్ వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది ఆసీస్. లబూషేన్ 27 పరుగులు, మాక్సెవెల్ 15 రన్స్ మాత్రమే చేశారు. కార్వే డకౌట్ అయ్యాడు. చివర్లో కమిన్స్, స్టార్క్ మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు 190 పరుగులకు చేరింది. చివరకు 199 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో  రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. కులదీప్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. 


Also Read: Virat Kohli Stunning Catch: గాల్లోకి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ.. వీడియో చూశారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి